Low Blood Pressure: రక్తం తక్కువగా ఉందా? అయితే, ఈ ఆహారాలను తినండి! 1 y ago

featured-image

హిమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఉండే ప్రోటీన్, ఇది ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. రక్తం ఎర్ర రంగులో ఉండడానికి హిమోగ్లోబినే కారణం. ఆక్సిజన్‌ను రవాణా చేయడంతో పాటు, హిమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్‌ను ఎర్ర రక్త కణాల నుంచి ఊపిరితిత్తులకు తీసుకు వెళ్ళుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే, రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి. మగవారిలో 100 గ్రాముల రక్తంలో సగటున 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రాములు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్థాయిల కంటే తక్కువ ఉంటే, రక్తహీనత, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిస్సత్తువ, హార్మోన్‌ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం, గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ మరియు పీరియడ్స్ కారణంగా, స్త్రీలు పురుషుల కంటే ఈ సమస్యలకు ఎక్కువగా గురవుతారు. దేశంలో సగానికిపైగా మహిళలు మరియు పిల్లలు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్ల‌డిస్తున్నాయి.


ఖర్జూరం


ఖర్జూరంలో ఐరన్‌ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ స్థాయులు మెరుగవుతాయి, ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరం ఐరన్‌ను గ్రహించేందుకు అవసరమైన కాపర్‌ కూడా ఖర్జూరంలో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఫలంలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్‌ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్నవారు రోజూ ఖర్జూరం తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఒక అధ్యయనంలో, ఖర్జూరాలను పాలలో మరిగించి, 18 నుండి 55 ఏళ్ల వ్యక్తులకు పదిరోజుల పాటు ఇచ్చినప్పుడు, వారి రక్తంలో హిమోగ్లోబిన్‌ గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు.


నువ్వులు


నువ్వుల్లో ఐరన్, కాపర్‌ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, ఇవి రక్తహీనతను అధిగమించడంలో సహాయపడతాయి. నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉండటం వల్ల, వీటిని తరచుగా తింటే రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు, నీరసంగా ఉండేవారు నువ్వులు మరియు బెల్లం కలిపిన‌ ఉండలు చేసుకుని తినడం మంచిది.


మిల్లెట్స్‌


మిల్లెట్స్‌ రోజూ తీసుకుంటే, హిమోగ్లోబిన్‌ మరియు సీరం ఫెర్రిటిన్‌ స్థాయులు మెరుగవుతాయని అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా, ఊదలు మీ ఆహారంలో చేర్చడం ద్వారా హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఊదలు తక్కువ కెల‌రీలు, ఎక్కువ ఫైబర్‌, ప్రొటీన్‌, మరియు మినరల్స్‌ కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తాయి. ఎనీమియాతో బాధపడుతున్న వారు, హిమోగ్లోబిన్‌ స్థాయిని త్వరగా పెంచుకోవాలనుకుంటే, దీనిని తరచుగా తీసుకోవచ్చు. హిమోగ్లోబిన్‌ లోపంతో బాధపడేవారు కొర్ర‌లు కూడా తీసుకోవడం మంచిది. వీటిలో ఐరన్‌, క్యాల్షియం, ప్రొటీన్లు, మరియు విటమిన్లు A, B, C పుష్కలంగా ఉంటాయి.


ఎండుద్రాక్ష


ఎండుద్రాక్షలో ఐరన్‌ మరియు కాపర్‌ అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు మరియు హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి స‌హాయ‌ప‌డ‌తాయి. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే, హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి.


తోటకూర


హిమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉన్నప్పుడు, తోటకూరను మీ ఆహారంలో చేర్చడం మంచిది. తోటకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది, దీనిని తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్‌ స్థాయులు మరియు ఎర్ర రక్త కణాల సంఖ్య మెరుగవుతాయి.




గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.



ఆస్తమా తీవ్రతను తగ్గించే చిట్కాలు.!

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD